కలం, సారంగాపూర్ : పాము కాటు (Snakebite) కు గురై యువకుడు మృతి చెందిన ఘటన సారంగాపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవితండాకు చెందిన రాథోడ్ గంగారాం (21) అనే యువకుడు సోమవారం తన పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. దీంతో గ్రామస్తుల సహాయంతో అతడిని వెంటనే నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి రాథోడ్ సీతారామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.

