కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) నియోజకవర్గంలోని వెంకటమ్మ కుంట తాండాలో టంకర రోడ్ నుంచి కొత్త తాండా వరకు రూ.64 లక్షల టీడబ్ల్యూడీ నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్ పనులకు ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలను అనుసంధానం చేసే రహదారులు అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. రహదారులు మెరుగుపడితే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు గ్రామస్థులకు సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
“ప్రతి తాండాకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యం” అని ఆయన (Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ పథకం వల్ల మహిళలు విద్య, ఉపాధి రంగాల్లో ముందుకు సాగుతున్నారని తెలిపారు. “మహిళల భాగస్వామ్యంతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యం” అని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సంఘాల ద్వారా సూపర్ మార్కెట్లు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతున్నాయని తెలిపారు. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత భీమా అందిస్తున్నామని, దీని ద్వారా ప్రతి కుటుంబం ధీమాగా ఉంటుందని అన్నారు. ఇన్ని చేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, ఎల్లప్పుడు అండగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, గ్రామ సర్పంచ్ బొట్టు వెంకట్ నాయక్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. మహేందర్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టంకర కృష్ణయ్య యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు ఇస్నాతి సుధాకర్, శీను నాయక్, లింగం నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు బొక్కి రాములు, విజయ్ నాయక్, వెంకటయ్య, గోవింద్ యాదవ్, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: పవన్ కళ్యాణ్ ఇష్యూపై రేవంత్ అనూహ్య వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

