epaper
Wednesday, February 18, 2026
epaper

మణిపూర్​ సీఎంగా యమ్నం ఖేమ్​చంద్!​

కలం, వెబ్​డెస్క్​: ఈశాన్య రాష్ట్రం మణిపూర్​లో (Manipur) రాష్ట్రపతి పాలనకు తెరపడనుంది. దాదాపు ఏడాది నుంచి ప్రెసిడెంట్​ రూల్​లో ఉన్న ఈ రాష్ట్రానికి కొత్త సీఎం రానున్నారు. భారతీయ జనతా పార్టీ నేత యమ్నం ఖేమ్​చంద్​ సింగ్ (Yamnam Khemchand)​ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఆయన మంగళవారం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికవడం దీనికి సంకేతంగా భావిస్తున్నారు. అలాగే, మహిళా నేత నెమ్చా కిప్​జెన్​ డిప్యూటీ సీఎం కానున్నట్లు తెలుస్తోంది. 62 ఏళ్ల ఖేమ్​చంద్..​ సింగ్జమేయి అసెంబ్లీ స్థానం నుంచి, 63 ఏళ్ల కిప్​జెన్.. కాంగ్​పోక్పీ​ సీట్​ నుంచి 2017, 2022లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. మణిపూర్​ అసెంబ్లీ పదవీ కాలం 2027 వరకు ఉంది.

మైతేయి, కుకీ జాతుల మధ్య సంఘర్షణతో అట్టుడికిన మణిపూర్​లో గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి ముఖ్యమంత్రి బీరేన్​ సింగ్​ రాజీనామా తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత క్రమంగా పరిస్థితి సద్దుమణగడంతో రాష్ట్రపతి పాలన తొలగించడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలో కొత్త సీఎం (Yamnam Khemchand), డిప్యూటీ సీఎంలతో త్వరలోనే మణిపూర్​లో ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది.

మణిపూర్​ శాసనసభలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ఇందులో 32 మంది బీజేపీ నుంచి గెలిచారు. ఎన్​పీపీ (నేషనల్​ పీపుల్స్​ పార్టీ), జేడీయూ నుంచి ఆరుగురు చొప్పున, కాంగ్రెస్​, నాగా ఫ్రంట్​ నుంచి ఐదుగురు చొప్పున ఎన్నికయ్యారు. అలాగే కుకీ పీపుల్స్​ ఫ్రంట్​ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లు ముగ్గురు ఎన్నికయ్యారు.

Read Also: టారిఫ్స్​ తగ్గించడానికి కారణాలివేనా?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>