Mobile Popup Ad
Mobile Popup Ad

డ్రగ్స్ కంపెనీలో ప్రమాదం.. కార్మికుడు మృతి

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా బొంతపల్లి పారిశ్రామిక వాడలోని మైత్రి డ్రగ్స్ పరిశ్రమ ల్యాబ్స్‌లో విషాదం చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తుండగా ప్రమాదానికి గురైన కార్మికుడు ప్రవీణ్ కుమార్ (25) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు మెదక్ జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

మూడు రోజుల క్రితం పరిశ్రమలో ప్రమాదం జరిగిందని, విషయం బయటకు రాకుండా కార్మికుడిని సమీపంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ప్రవీణ్ కుమార్ మృతి చెందాడు .

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>