గద్వాల పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. 925 మందికి చేయూత!

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) పట్టణానికి చెందిన 925 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం గద్వాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు.

ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్, మున్సిపల్ కమీషనర్ జానకీరాం సాగర్, అధికారులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>