కలం, వెబ్ డెస్క్: చనిపోయిందనుకున్న మహిళ తిరిగి ప్రాణం పోసుకున్న ఆశ్చర్యకరమైన ఘటన ఏలూరు (Eluru) జిల్లాలో చోటు చేసుకుంది. గుంత కారణంగా ఆమె బతికినట్లు తెలుసుకుని అంతా షాకవుతున్నారు. కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచి గురజాల రామతులసి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఏలూరులోని ఓ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గుంతలో పడటంతో..
రామతులసి (Rama Tulasi) మృతదేహాన్ని అంబులెన్స్‌లో సొంతూరుకి తరలిస్తున్నారు. మార్గమధ్యలో అంబులెన్స్ వేగంగా వెళ్తూ గుంతలో పడటంతో ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. దీంతో రామతులసి శరీరంలో కదలికలు రావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు.. మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆశ్చర్యంగా ఆమె ప్రాణాలతో ఉన్నట్లు వైద్యులు సైతం గుర్తించి, వెంటనే ఐసీయూలో చేర్పించి చికిత్స ప్రారంభించారు. చనిపోయిందనుకున్న మహిళ.. మళ్లీ బతికినట్లు విషయం తెలుసుకుని వైద్యులు, గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు.
Read Also: భోగాపురంలో థింసా ప్రదర్శనకు గిన్నిస్ రికార్డ్!
Follow Us On : WhatsApp

