నదిలో చిక్కుకున్న కార్మికులు.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్

​కలం, ఖమ్మం బ్యూరో: గోదావరి నది ఉగ్రరూపం దాల్చడంతో (Godavari Floods) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ఒక్కసారిగా విరుచుకుపడిన వరద ఉధృతికి చర్ల సమీపంలోని వీరాపురం ఇసుక ర్యాంపు వద్ద భారీ ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీ పనుల్లో నిమగ్నమై ఉన్న సుమారు 20 మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లు, మిషన్ ఆపరేటర్లు ఆకస్మికంగా పెరిగిన వరద నీటి మట్టంతో బయటకు రాలేక నది మధ్యలోనే చిక్కుకుపోయారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని నది ప్రవాహంలో దిగ్బంధమైన కార్మికులను కాపాడేందుకు జిల్లా (Bhadradri Kothagudem) యంత్రాంగం, అత్యవసర సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి.

​సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, రెస్క్యూ బృందాలు హోరెత్తుతున్న నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ బాధితులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు కొనసాగిన ప్రాణరక్షణ చర్యల్లో 15 మంది కార్మికులను అధికారులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. నది మధ్యలో ఇరుక్కుపోయిన మిగిలిన ఐదుగురిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ శరవేగంగా కొనసాగుతోంది. గోదావరి నీటి మట్టం నిమిషనిమిషానికీ పెరుగుతుండటంతో తీర ప్రాంతాల ప్రజలతో పాటు ఇసుక క్వారీల వద్ద పనిచేసే కార్మికులు, స్థానికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Read Also: గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>