మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలి: ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహిళలు శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను వినియోగించుకుని స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఆర్థిక స్వావలంబన సాధించి జీవితంలో స్థిరపడాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Khushboo Gupta) సూచించారు.

శుక్రవారం బండమీదిపల్లిలోని ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంస్థలో ఎంబ్రాయిడరీ, మగ్గం పనుల్లో శిక్షణ పొందుతున్న మహిళా అభ్యర్థులతో మాట్లాడి శిక్షణ వివరాలు, అందిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలు శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను వినియోగించుకుని స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.

అనంతరం సంస్థలోని వంటశాలను పరిశీలించి, శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని కలెక్టర్ (Khushboo Gupta) ఆదేశించారు. శిక్షణ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, మహిళలకు ఉపాధి కల్పించే దిశగా అవసరమైన ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ పి. ప్రభాకర్, కోఆర్డినేటర్లు చరణ్, రవి, శిక్షకురాలు సుకన్య, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>