Mobile Popup Ad
Mobile Popup Ad

పెళ్లిళ్లలో మద్యానికి బదులు ‘వాటర్ బార్స్’.. నెట్టింట సరికొత్త ట్రెండ్!

కలం, వెబ్ డెస్క్: దాహం తీర్చుకోవడానికి సాధారణంగా తాగునీటిని తాగుతాం. కానీ ప్రస్తుతం ఈ రోజుల్లో డ్రికింగ్ వాటర్ అనేది సమాజంలో హోదాను, జీవనశైలిని ప్రతిబింబించేవిధంగా మారింది. ప్లాస్టిక్ సీసాల స్థానంలో డిజైనర్ బాటిళ్లు, స్ప్రింగ్, రకరకాల వాటర్ బాటిల్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రముఖ కంటెంట్ క్రియేటర్ సాక్షి శివదాసాని ఒక వివాహ వేడుకలో మద్యం రహిత ‘వాటర్ బార్’ను (Water Bars) ఏర్పాటు చేసింది. ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నోరూరించే ఆహార పదార్థాలతో పాటు వాటర్ బార్‌లను వివాహాల్లో ఏర్పాటు చేయడం ట్రెండ్‌గా మారుతోంది. భారతీయ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తాగే ‘ఎవియాన్’ వంటి బ్రాండ్లతో మొదలైన ఈ ప్రీమియం వాటర్ క్రేజ్ అంతటా విస్తరిస్తోంది.

వైన్ (Wine) రుచులను పరీక్షించే నిపుణుల తరహాలో నీటి నాణ్యత, ఖనిజాల లభ్యత ఆధారంగా తయారయ్యే దానికి ఆదరణ పెరుగుతోంది. నీరు కేవలం హైడ్రేషన్ కోసం మాత్రమే కాదని, దాని వెనుక ఉండే ఖనిజాల లభ్యత, రుచిని బట్టి దాని విలువ మారుతుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే మార్కెట్లో ఒక్కో లీటర్ ప్రీమియం నీటి బాటిల్ ధర వందల రూపాయల పలుకుతోంది.

మినరల్ వాటర్ పరిశ్రమలో వస్తున్న మార్పులపై ఆవా నేచురల్ మినరల్ వాటర్ బ్రాండ్ మేనేజర్ మాట్లాడుతూ.. అన్ని నీళ్లూ ఒకటి కావనే ప్రాథమిక వ్యత్యాసాన్ని స్పష్టం చేశారు. సాధారణంగా బయట లభించే ప్యూరిఫైడ్, ఆర్వో నీటితో పోలిస్తే, సహజ సిద్ధమైన ప్రదేశాల నుండి సేకరించే మినరల్ వాటర్‌లో కాల్షియం, మెగ్నీషియం, సిలికా లాంటివి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>