కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకు సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సమావేశంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుతో పాటు జూరాలపై ఆధారపడిన రాజీవ్ భీమా, జవహర్లాల్ నెహ్రూ, కోయిల్‌సాగర్, శ్రీశైలం, మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సంబంధించిన సాగునీటి అంశాలపై చర్చించనున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు, నీటిపారుదల, వ్యవసాయ శాఖల అధికారులు సమావేశానికి హాజరుకానున్నారు. జూరాల ఆయకట్టు, ఎత్తిపోతల పథకాల నీటి లభ్యత, సాగునీటి అంశాలపై సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

