2014లో బీజేపీ గుర్తుకు రాలేదా?: ఎమ్మెల్యేపై బీజేపీ నేత ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో : వేములవాడ నియోజకవర్గం నుండి 2014లో ఏ పార్టీ నుండి పోటీ చేశారో, ఎందుకు చేశారోనని నియోజకవర్గ ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రజలకు ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వివరించాలని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ (Thimmapur) మండల బీజేపీ మాజీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి డిమాండ్ చేశారు. హిందువుల సంస్కృతి కి ఆలవాలమైన బోనాల పండగకు అరకొర నిధులు కేటాయించడం పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడితే.. మత రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించడం ఆది శ్రీనివాస్ అహంకారానికి నిదర్శమని మంగళవారం నాటి పత్రికా ప్రకటన లో పేర్కొన్నారు.

2014లో ఎమ్మెల్యే టికెట్ కోసం బీజేపీని ఆశ్రయించి పోటీ చేసినప్పుడు కాషాయ పార్టీ గురించి తెలియలేదా? అని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన తర్వాత స్థానిక దేవాలయ అభివృద్ధి గురించి ఎన్నడైనా మాట్లాడినారా? అని నిలదీశారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని మాట్లాడిన ముఖ్యమంత్రి మాటలు గుర్తుకు లేవా? అంటూ ప్రశ్నించారు. అవకాశాల కోసం పార్టీలు మారిన ఆది శ్రీనివాస్‌కు బీజేపీని, బీజేపీ నాయకులను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.

కేంద్ర నిధుల మంజూరు విషయంలో కేంద్ర నిధులు రాకపోతే గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా హిందువులకు జరుగుతున్న అన్యాయాలపై ఆది శ్రీనివాస్ ఎప్పుడైనా ప్రశ్నించారా? అని అడిగారు. బైంసాలో హిందువుల ఇళ్లను తగులబెట్టినప్పుడు స్పందించింది, వారికి అండగా నిలిచింది బండి సంజయ్ కాకపోతే మీరా? అని ఆది శ్రీనివాస్‌‌ను ప్రశ్నించారు. హిందువుల కోసం పోరాడే వ్యక్తిని విమర్శించే ముందు కాంగ్రెస్ పార్టీ ఏ మతస్తులకు కొమ్ము కాస్తుందో తెలుసుకోవాలని హితవు పలికారు. హైందవ సంస్కృతికి రక్షణగా నిలవని మీరు.. బీజేపీ ని, బీజేపీ నాయకులను విమర్శించడం అతి తెలివికి, అవివేకాకానికి పరాకాష్ట అని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ పై విమర్శలు మాని దక్షిణ కాశీగా పేరు గాంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని వెంటనే పూర్తి చేసి అక్కడి ప్రజలకు, స్వామి వారి భక్తులకు, హైందవ జాతికి తమరిపైన నమ్మకాన్ని కలిగించుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>