కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో మహిళా బిల్లు వీగిపోవడంతో మోడీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోడీ (PM Narendra Modi) తర్వాత ఏం చేయబోతున్నారని సర్వత్రా ఆసక్తితో ఎదురు చూస్తున్న వేళ సోషల్ మీడియాలో మోడీ పేరిట ఓ వీడియో వైరల్‌గా మారింది. మోడీ ఓ మహిళతో ఫేషియల్ మసాజ్ చేయించుకుంటున్నారంటూ పలువురు కాంగ్రెస్ (Congress) అనుకూల వ్యక్తులు సోషల్ మీడియాలో ఓ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు. ఇది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ (BJP) సోషల్ మీడియా కార్యకర్తల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఇది మోడీ కాదని, ఫేక్ వీడియో ప్రచారం చేస్తున్నారని బీజేపీ వాళ్లు చెప్తుంటే, ఇలాంటి వీడియోలు మోడీవి ఇంకా చాలా ఉన్నాయని, అమెరికా దగ్గర వేలల్లో మోడీ వ్యక్తిగత వీడియోలు ఉన్నాయని కాంగ్రెస్ అనుకూల వ్యక్తులు కామెంట్లతో పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వాస్తవానికి ఈ వీడియోలో ఉన్నది ప్రధాని మోడీ కాదు. ప్రదీప్ కౌర్ థిల్లాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ భర్త అని తేలింది. ఆయన పోలికలు ప్రధాని మోడీకి (PM Modi) మ్యాచ్ కావడంతో కొందరు వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోకు ప్రధానితో ఎలాంటి సంబంధం లేదని, ప్రజలను తప్పుదారి పట్టించేలా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. సదరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ భర్తతో ఉన్న అసలు ఫోటోలను పెట్టి బీజేపీ వ్యక్తులు వివరణ ఇస్తున్నారు. ఫేక్ కంటెంట్‌ను ఎవరూ వైరల్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.
Read Also: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా రెండో విడతకు డేట్ ఫిక్స్!
Follow Us On: X(Twitter)

