విజయవాడ డ్రగ్స్ కేసు: పోలీసు కస్టడీకి బషీర్, నాగసౌమ్య!

కలం, వెబ్ డెస్క్ : విజయవాడ ఎండీఎంఏ (Vijayawada MDMA) డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితులు బషీర్, నాగసౌమ్యలను పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో భాగంగా అక్టోబర్ 15న పక్కా సమాచారంతో పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

తన ప్రియుడిని జైలు నుంచి బెయిల్‌పై బయటకు తీసుకురావడానికి అవసరమైన డబ్బు కోసం నాగసౌమ్య ఈ అక్రమ రవాణాకు పాల్పడింది. బషీర్ ఆమెకు డబ్బు ఆశ చూపించి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించాడు. ఈ క్రమంలో 110 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను తరలిస్తుండగా నాగసౌమ్య పోలీసులకు పట్టుబడింది.

ప్రస్తుతం నిందితులిద్దరినీ మరో మూడు రోజుల పాటు కస్టడీలో ఉంచి పోలీసులు విచారించనున్నారు. ప్రధానంగా బషీర్, నాగసౌమ్యల ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న డ్రగ్స్ కొనుగోలుదారుల వివరాలు, ఈ నెట్‌వర్క్ మూలాలపై దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>