కలం, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ (Tirumala Laddu) చుట్టూ జరుగుతున్న రాజకీయాలపై విజయవాడ కోర్ట్ (Vijayawada Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సున్నితమైన అంశంపై డిబేట్లు పెట్టడం ఆపాలని పలు చానళ్లకు నోటీస్‌లు జారీ చేసింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ గతంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేగింది. వైసీపీ, కూటమి పరస్పర ఆరోపణల అనంతరం విషయం సుప్రీం కోర్ట్ వరకు వెళ్లింది. దీంతో కోర్ట్ నిజానిజాలు తేల్చేందుకు సిట్ వేయగా తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు లేదని వెల్లడైంది.
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సిట్ నివేదిక ఇచ్చినా కూడా పలు టీవీ చానళ్లు ఆ అంశంపై డిబేట్లు పెడుతూ రాద్ధాంతం చేస్తున్నాయని, ఇలాంటి చర్యలతో మత విశ్వాసాలు దెబ్బతింటాయని, అలాంటి కథనాలు ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని చింతా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి విజయవాడ సీనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్ట్ శుక్రవారం విచారణ చేపట్టింది. తిరుమల లడ్డుపై డిబేట్లు ఆపేయాలని ఏబీఎన్, టీవీ5, మహా న్యూస్, ఈటీవీ చానళ్లకు నోటీసులు జారీ చేసింది.


