Mobile Popup Ad
Mobile Popup Ad

రష్మిక రాకతో విజయ్ జాతకం మారనుందా?

కలం, సినిమా : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారారు. ఆ సినిమా వల్ల  దేశవ్యాప్తంగా విజయ్ దేవరకొండకు సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ తరువాత నుంచి విజయ్  భారీ బడ్జెట్ మూవీస్ చేయడం మొదలు పెట్టారు. కానీ అర్జున్ రెడ్డి రేంజ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన ‘లైగర్’ సినిమాతో విజయ్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడని అంతా భావించారు. కానీ ఆ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ కావడంతో.. విజయ్ పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.

గత కొంతకాలంగా విజయ్ వరుస పరాజయలు అందుకుంటున్నాడు. అయితే ఎంత ట్రోల్ చేసిన విజయ్ క్రేజ్ మాత్రం అలానే ఉంది. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna)ను వివాహం చేసుకోవడంతో విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో సూపర్ హైప్ ఇస్తున్నారు. విజయ్‌ని బాహుబలి, అర్జునుడు, రాముడు అంటూ తెగ పొగిడేస్తున్నారు. రష్మిక రాకతో విజయ్ జాతకం మారుతుందని.. ఇక విజయ్ సక్సెస్ బాట పడతాడని పండితులు సైతం చెబుతున్నారు. అయితే విజయ్, రష్మిక జంట చూడముచ్చటగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>