కృష్ణా జలాల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : కృష్ణా జలాల (Krishna Water) పంపిణీ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరపాల్సి ఉన్నందున, త్వరలోనే ఏడుగురు జడ్జీలతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు సీజేఐ తెలిపారు. అంతేకాదు ఈ కేసును తేల్చకుండా తాను రిటైర్ కాను అని తేల్చి చెప్పారు.

ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం తోసిపుచ్చింది. ప్రస్తుతం ఈ పిటిషన్ ముగ్గురు జడ్జీల బెంచ్ ముందుకు రాగా, వీలైనంత త్వరగా దీన్ని విచారణకు తీసుకుంటామని చెప్పారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ మొదటి వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా, కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>