మళ్లీ బోరుమన్న బొత్స.. వైసిపి సమావేశంలో భావోద్వేగం!

కలం, వెబ్ డెస్క్ : విజయనగరంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ మంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మరోసారి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగిస్తుండగా బొత్స కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఆవేదనను గమనించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు బొత్సను ఓదార్చారు.

ఇటీవల చీపురుపల్లిలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలోనూ బొత్స సత్యనారాయణ బోరున ఏడ్చేసిన సంగతి తెలిసిందే. తన మేనల్లుడు, కీలక నేత చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడాన్ని బొత్స జీర్ణించుకోలేకపోతున్నారు. కుటుంబంలోనూ, పార్టీలోనూ సుదీర్ఘ అనుబంధం ఉన్న చిన్న శ్రీను తీసుకున్న ఈ నిర్ణయం బొత్స(Botsa Satyanarayana)ను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని, ఆ దిగులుతోనే ఆయన వరుసగా పార్టీ వేదికలపై భావోద్వేగానికి గురవుతున్నారని స్థానిక నాయకులు వెల్లడించారు.

Also Read : ఏపీలో క్రిటికల్ కేర్ బ్లాక్స్ ప్రారంభం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>