జాతీయ పతాక రూపకర్తకు ‘భారతరత్న’ ఇవ్వాలి.. ప్రధానికి వీహెచ్ సంచలన లేఖ

కలం, వెబ్ డెస్క్: స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్రాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడు, మాజీ ఎంపీ హనుమంతరావు (V Hanuman Rao)  డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి హనుమంతరావు లేఖ రాశారు. 1921లో భారత పతకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్యకు దేశం అందించగల ఏకైక సముచితమైన నివాళి ఆయనకు భారత రత్న ఇవ్వడమేనని లేఖలో తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ పిలుపునివ్వడం మంచిదేనని.. కానీ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య సేవలను విస్మరించడం బాధాకరమని పేర్కొన్నారు. దివంగత పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం ప్రపంచ వ్యాప్తంగా ప్రాముఖ్యాన్ని, విస్తృత గుర్తింపును పొందిందని గుర్తు చేశారు. అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలకు చెందిన పింగళి వెంకయ్య సేవలను తక్కువ చూసి చూడటం భారత పతాక రూపకర్తకు జరిగిన అవమానకరమని మండిపడ్డారు. హైదరాబాద్‌లో తాను పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే పింగళి వెంకయ్యకు భారత రత్న ప్రకటించాలని తన లేఖలో హనుమంతరావు డిమాండ్ చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>