కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ దేశంలోనే మొదటిసారిగా ఒక కఠిన చర్యకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఆశిష్ గ్యాస్ ఏజెన్సీ యజమాని పవన్ వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా గ్యాస్ సిలిండర్లను దాచిపెట్టి, వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు నిరూపితం కావడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. కేవలం అరెస్టుతోనే సరిపెట్టకుండా, సదరు ఏజెన్సీకి ఉన్న లైసెన్స్‌ను కూడా అధికారులు తక్షణమే రద్దు చేశారు. వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ అక్రమాలకు పాల్పడే ఏజెన్సీలపై రాజీలేని పోరాటం చేస్తామని ఈ చర్య ద్వారా యోగి ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు పంపింది.

