Mobile Popup Ad
Mobile Popup Ad

మంత్రి నారాయణను కలిసిన బిట్స్ పిలానీ ప్రతినిధులు

కలం, వెబ్ డెస్క్ : అమరావతి (Amaravati) లో ఏర్పాటు చేయనున్న బిట్స్ పిలానీ (BITS Pilani) క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలపై బిట్స్ ప్రతినిధులు మంత్రి నారాయణ (Narayana) ను కలిశారు. క్యాంపస్‌లో నిర్మించబోయే భవనాల డిజైన్లను మంత్రి నారాయణకు వారు వివరించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో మందడం, వెంకటపాలెం గ్రామాల మధ్య సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో బిట్స్ పిలానీ క్యాంపస్‌ను నిర్మించనున్నారు. ఈ క్యాంపస్‌ను అత్యాధునిక సదుపాయాలతో కూడిన AI+ క్యాంపస్‌గా అభివృద్ధి చేయాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఈ ప్రాజెక్టును మొత్తం మూడు దశల్లో నిర్మించనున్నట్లు వారు వెల్లడించారు. మొదటి దశ పనులను వేగంగా పూర్తి చేసి, రెండున్నర సంవత్సరాల్లోనే అడ్మిషన్లు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారాయణ (Narayana) కు వివరించారు. అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్ ఏర్పాటుతో ఉన్నత విద్యా రంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని, దేశ విదేశాల నుంచి విద్యార్థులు ఆకర్షితులయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>