epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

సాదాసీదాగా కేంద్ర బడ్జెట్.. వరాలు లేవు.. వడ్డింపులు లేవు

కలం, తెలంగాణ బ్యూరో: సర్​ ప్రైజులు లేవు.. వరాలు లేవు.. వడ్డింపులూ లేవు! కేంద్రం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ (Budget) ​ అంతా సాదాసీదా!! స్టాక్​ మార్కెట్లకు పెద్దగా నచ్చలేదు. వ్యాపారవర్గాలు ఉసూరుమన్నాయి. సామాన్యులకు పెద్దగా ఊరట లేదు. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాలపై మునుపటిలా ఓట్ల కోసం వరాలు కురిపిస్తారన్న ముందస్తు అంచనాలు కూడా బెడిసికొట్టాయి. ‘వికసిత్​ భారత్ –2047’ లక్ష్యంగా బడ్జెట్​ ను తెస్తున్నామని ఆదివారం పార్లమెంట్​ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)​ ప్రకటించారు.

అంతకంతకూ పెరిగినా..!

కేంద్ర బడ్జెట్​ (Budget) విలువ నానాటికీ పెరిగిపోతున్నది. 2‌025–26 బడ్జెట్​ తో పోలిస్తే.. ప్రస్తుతం 6.8 శాతం పెరిగింది. నిరుడు 50,65,345 కోట్లు ఉండగా.. ఇప్పుడు అది 53,47,351 కోట్లకు చేరింది. ఇందులో ఎప్పటిలాగే రక్షణ రంగానికి పెద్ద పీట వేశారు. కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు రూ. 1.4 లక్షల కోట్లను కేటాయించారు.

కర్తవ్య భవన్ .. 3 కర్తవ్యాలు

కర్తవ్య భవన్ లో రూపుదిద్దుకున్న తొలి బడ్జెట్ ఇది అని నిర్మలమ్మ ప్రకటించారు. మూడు కర్తవ్యాలే పునాదులుగా దీన్ని తెస్తున్నామని చెప్పారు.
1. ఆర్థిక వృద్ధి స్పీడప్: అంతర్జాతీయ పోటీని తట్టుకొని నిలబడేలా దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దడం.
2.ప్రజల ఆకాంక్షలు ఫలించడం: దేశ ప్రజల స్కిల్స్​ ను పెంచి, దేశాభివృద్ధిలో అన్నివర్గాలను భాగస్వామ్యం చేయడం. విద్య, స్కిల్ డెవలప్​ మెంట్​ తో యువతకు ఉపాధి కల్పించడం.
3. సబ్​ కా సాత్​.. సబ్​ కా వికాస్​: ప్రతి కుటుంబానికి, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు అందేలా చూడటం. వెనుకబాటు నుంచి దూరం చేయడం.

Read Also: బడ్జెట్ ఎఫెక్ట్.. కుప్పకూలిన సెన్సెక్స్​, నిఫ్టీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>