గర్భం దాల్చిన ఇద్దరు మైనర్ బాలికలు.. పోక్సో కేసు నమోదు

కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా బయ్యారం (Bayyaram) మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు గర్భం దాల్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా ఐసీడీఎస్ అధికారులు.. ఆ బాలికలను రక్షణ కల్పిస్తూ సంరక్షణ కోసం ‘బాల రక్షక్ భవన్’ కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కే.విజయ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రశాంత్ బాబు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు వేగవంతం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>