ORRపై ప్రమాదం.. ఇద్దరు మెదక్ జిల్లా వాసుల మృతి

కలం మెదక్ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్‌పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం (ORR Accident) జరిగింది. మెదక్ జిల్లా పాపన్నపేట గ్రామానికి చెందిన చిన్నకటికే గౌస్, చిన్నకటికే రషీద్‌లు తమ మేకలను అమ్ముకోవడానికి అశోక్ లేలాండ్ వాహనంలో హైదరాబాద్‌లోని చంగిచర్ల మార్కెట్‌కు బయలుదేరారు. ఈ వాహనానికి గిర్నీ రాములు డ్రైవర్‌గా ఉన్నాడు. ​వీరి వాహనం కీసర ఓఆర్ఆర్ పరిధిలోకి చేరుకోగానే, వేగంగా వచ్చిన ఒక లారీ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ గిర్నీ రాములు, చిన్నకటికే రషీద్ ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. చిన్నకటికే గౌస్ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>