కలం, వెబ్ డెస్క్: కరీంనగర్‌లోని (Karimnagar) మెడికవర్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గోపాలరావుపేటకు చెందిన నెల్లి తిరుపతి (40), తండ్రి ఎల్లయ్య, మూడు రోజుల క్రితం రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని షానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మెడికవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం తిరుపతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. అయితే, పేషెంట్‌ను బంధువులకు చూపించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు (Patient Relatives Protest) దిగారు. దీంతో హాస్పిటల్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

