గాంధీ ముని మనవడితో అభిజిత్​ డిప్కే భేటీ!

క‌లం, వెబ్‌డెస్క్‌: మ‌హాత్మా గాంధీ ముని మ‌న‌వ‌డు తుషార్ గాంధీ (Tushar Gandhi) కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ డిప్కే (Abhijeet Dipke)ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా తుషార్ గాంధీకి తన నివాసంలో ఆతిథ్యం ఇవ్వడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అభిజిత్ తెలిపారు. దేశంలో జెన్ జీ కేవలం ఉద్య‌మాల‌కు పరిమితం కాకుండా మహాత్మా గాంధీ నిజమైన విలువలను, ఆదర్శాలను ఆచరణలో పాటిస్తున్నారని తుషార్ గాంధీ కొనియాడారు.

ఢిల్లీలో నిరసనల సందర్భంగా జరిగిన హింసపై కేంద్ర ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందని తుషార్ గాంధీ మండిపడ్డారు. గాంధీ కుటుంబం నుంచి మద్దతు లభించడం తమ ఉద్యమం శాంతియుతంగా, అహింసా మార్గంలో సాగిందనేదానికి నిదర్శనమని అభిజీత్ డిప్కే తెలిపారు. తుషార్ గాంధీ, అభిజిత్‌ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>