విశాఖ సెంట్రల్ పార్క్ వద్ద కలకలం.. రోడ్డు పక్కన చిరిగిన కరెన్సీ నోట్లు!

కలం, వెబ్ డెస్క్: విశాఖపట్నం (Visakhapatnam) నగరంలోని సెంట్రల్ పార్క్ ప్రధాన ద్వారం సమీపంలో భారీగా చిరిగిన కరెన్సీ (Torn Currency) నోట్లు ప్రత్యక్షం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం వాకింగ్ కోసం వచ్చిన స్థానిక వాకర్స్, VMRDA సిటీ సెంట్రల్ పార్క్ ఎదుట రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తులు 500, 100, 50, 20, 10 రూపాయల కరెన్సీ నోట్లు కుప్పగా పడేసి వెళ్లడాన్ని గమనించారు.

వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ నోట్లను మనుషులు కావాలనే చింపేసి పడేశారా లేదా ఎలుకలు ఏమైనా కొరికాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>