మాజీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య

కలం, వెబ్ డెస్క్ : టీఎంసీ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ (Asish Banerjee) ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగాల్ బీర్భూమ్‌లోని రాంపూర్‌హాట్‌లో తన నివాసానికి సమీపంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆశిష్ బెనర్జీ (Asish Banerjee) మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన మరణానికి గల కారణాలు తెలయాల్సి ఉంది.

కాగా, ఆశిష్ బెనర్జీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలు కీలక మంత్రిపదవులు చేపట్టారు. టీఎంసీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ ఘోర పరాజయం పాలయింది. ఎన్నికలు జరిగిన కొన్ని వారాల తర్వాత ఆశిష్ బెనర్జీ బీర్భూమ్ జిల్లా కోర్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

Also Read : హర్మూజ్ పై ఇరాన్ సంచలన నిర్ణయం.. ట్రంప్‌కు స్ట్రాంగ్ కౌంటర్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>