కలం, నిర్మల్ : తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (TGO) ఆధ్వర్యంలో ఈ నెల 14న నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్లను మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ట్రెజరీ అధికారి సరోజ, డీఆర్డీఓ పీడీ విజయలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని గృహకల్ప కాంప్లెక్స్‌లో ఉన్న టీజీవో భవన్‌లో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను గెజిటెడ్ ఉద్యోగులందరూ ఐకమత్యంతో, అత్యంత వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజీవో (TGO) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పీజీ రెడ్డి, కార్యదర్శి ధాత్రిక రమేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు అర్చన, జిల్లా కార్యవర్గ సభ్యురాలు లత తదితరులు పాల్గొన్నారు.

