విమాన టికెట్ల బుకింగ్ పేరుతో సినీ నటి అనితకు రూ.4.14 లక్షల టోకరా!

కలం, వెబ్ డెస్క్ : సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసానికి (Cyber Fraud) తెరలేపారు. విమాన టికెట్లు బుక్ చేస్తామంటూ (Flight Ticket Booking) సినీ నటి గోగినేని అనితను (Actress Anitha ) బురిడీ కొట్టించి ఏకంగా రూ.4.14 లక్షలు కాజేశారు. బిజినెస్ క్లాస్ టికెట్ల బుకింగ్ పేరుతో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌లోని కావూరి హిల్స్‌లో నివాసం ఉండే అనిత.. అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉంటున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లేందుకు విమాన టికెట్ల కోసం ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెంట్‌ను వెతికారు.

ఈ క్రమంలో ‘లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్’ సంస్థ పేరుతో రాజేష్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.4,14,180 అవుతుందని చెప్పి, బుకింగ్ ప్రక్రియ కోసం డెబిట్ కార్డు వివరాలను అడిగాడు. అతడి మాటలు నమ్మిన అనిత కార్డు వివరాలతో పాటు, టికెట్ బుకింగ్ జరుగుతోందని భావించి వచ్చిన ఓటీపీని కూడా వెల్లడించారు. దీంతో ఆమె బ్యాంకు ఖాతా నుంచి క్లియర్‌ట్రిప్ పేరిట రూ.4.14 లక్షలకు పైగా నగదు కట్ అయింది. అయినప్పటికీ విమాన టికెట్‌కు సంబంధించిన ఎలాంటి ధ్రువీకరణ సమాచారం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>