హసన్ నగర్‌లో ఘోరం.. కట్టుకున్న భార్యనే కడతేర్చిన భర్త!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని బహదూర్ పురా పరిధిలోని హసన్ నగర్‌లో దారుణ హత్య (Hasan Nagar Murder) జరిగింది. కట్టుకున్న భర్తే భార్యను కడతేర్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన అస్మాబేగం(30), ధర్మేందర్‌కు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. బీహార్ నుంచి వలస వచ్చిన ఈ దంపతులు 10 రోజుల క్రితమే హసన్ నగర్‌లోని అద్దె ఇంట్లో చేరారు.

అయితే మంగళవారం రాత్రి ధర్మేందర్ తన భార్య అస్మా బేగంను కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తమ మూడేళ్ల కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. అయితే హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. స్థానికుల సమచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>