ఆపిల్ యూజర్లకు షాక్: స్తంభించిన ఐక్లౌడ్, యాప్ స్టోర్!

కలం, వెబ్ డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా యాపిల్ వినియోగదారులు సాంకేతిక సమస్యల (Apple Outage)ను ఎదుర్కొంటున్నారు. ఐక్లౌడ్, యాపిల్ పే, యాప్ స్టోర్‌తో పాటు యాపిల్ వాచ్, ఐప్యాడ్ వంటి పలు సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే ఐఫోన్, మ్యాక్ డివైజ్‌లలో ఐక్లౌడ్ ఖాతాల నుంచి ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతున్నామని, తిరిగి లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటే సాధ్యం కావడం లేదని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే, యాపిల్ అధికారిక సిస్టమ్ స్టేటస్ పేజీలో మాత్రం దాదాపు అన్ని సేవలు సాధారణంగానే పనిచేస్తున్నట్లు చూపిస్తుండటం గమనార్హం. ఈ భారీ అంతరాయంపై యాపిల్ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత కొన్ని రోజులుగా వివిధ టెక్ సంస్థల సేవల్లో వరుసగా తలెత్తుతున్న సాంకేతిక లోపాల జాబితాలో తాజాగా యాపిల్ కూడా చేరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>