ఎంజీఆర్‌పై వ్యాఖ్యలు.. క్షమాపణలు తెలిపిన రాజేంద్ర ప్రసాద్

కలం, సినిమా : తమిళ సినీ దిగ్గజం ఎం.జి. రామచంద్రన్ (MG Ramachandran) గురించి చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) క్షమాపణలు తెలిపారు. తన అభిప్రాయం ప్రకారం ఎంజీఆర్ తమిళ సినిమాకి దేవుడి వంటి వ్యక్తి అని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. అయితే లెజెండరీ నటుడు కాంతారావు (Kantha Rao)  గారిని ప్రశంసించే సమయంలో అనుకోకుండా ఎంజీఆర్ గురించి అభ్యంతరకరమైన పదం ఉపయోగించానని తెలిపారు. ఆ వ్యాఖ్యలు తాను ఉద్దేశపూర్వకంగా అన్నవి కాదని, అందుకు తాను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇకపై ఇలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడతానని  ఆయన హామీ ఇచ్చారు.

Read Also: ఏపీలో ఉస్తాద్ భగత్‌సింగ్ టికెట్ రేట్ల పెంపు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>