వేతనాలకు e-KYC తప్పనిసరి.. తెలంగాణ కార్మికులకు కీలక అలర్ట్!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (VB-G RAM G) పథకం కింద విధులు నిర్వహిస్తున్న స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ కార్మికుల వేతనాల చెల్లింపులపై అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. కార్మికులు తమ వేతనాలను క్రమం తప్పకుండా పొందేందుకు తప్పనిసరిగా e-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆధార్ ధృవీకరణ , అలాగే బ్యాంకు ఖాతాల అనుసంధాన ప్రక్రియ వేగవంతం కాకపోతే వేతనాల జమలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ ఇ-కేవైసీ నమోదు ప్రక్రియ రాష్ట్రంలో రేపటి నుంచే అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కేటగిరీ పరిధిలో మొత్తం 76,659 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే, వీరిలో ఇప్పటివరకు కేవలం 79 మంది మాత్రమే e-KYC ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన కార్మికులందరూ నిర్దేశిత సమయంలోగా తమ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ నూతన నిబంధన ప్రకారం, e-KYC పూర్తయిన కార్మికుల పేర్లు మాత్రమే రోజువారీ ‘e-మస్టర్‌’ జాబితాలో నమోదవుతాయి. దీని ఆధారంగానే వారి రోజువారీ హాజరును గణించి వేతనాలను లెక్కిస్తారు. ఒకవేళ e-KYC పూర్తిచేసుకోని పక్షంలో, కార్మికులు తమ రోజువారీ హాజరును నమోదు చేసుకునే అవకాశం కోల్పోతారు. అంతేకాకుండా, గతంలో పనిచేసిన రోజులకు సంబంధించిన పాత వేతన బిల్లులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు తేల్చిచెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>