కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Telangana SIR) ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఓటర్లకు ఏమైనా అభ్యంతరాలుంటే సెప్టెంబర్ 16వ తేదీలోగా చెప్పాలని సీఈవో సుదర్శన్ రెడ్డి సూచించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు అభ్యంతరాలపై పరిశీలన, వాటికి పరిష్కార ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అక్టోబర్ 19వ తేదీన తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేయబోతున్నట్లు సీఈవో ప్రకటించారు. దీంతో, తెలంగాణలో సర్ ప్రక్రియ ముగుస్తుందన్నారు.
90 లక్షల మంది ఓటర్లకు..
సర్ ప్రక్రియలో అనుమానం వచ్చిన 90 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయబోతున్నట్లు సీఈవో సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. వీరంతా గడువు విధించిన లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 2,64,87,213 మంది ఎన్యుమరేషన్లు ఫారాలు తిరిగి అందించారని వివరించారు. 9,22,229 మంది మరణించినట్లు గుర్తించామన్నారు. 57,46,803 మంది ఓటర్లు శాశ్వతంగా తమ ఓటు హక్కును బదిలీ చేసుకోవడం, ఇతర కారణాలుగా పేర్కొన్నారు. 6,70,203 మంది పలు చోట్ల ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నట్లుగా తేలిందన్నారు.

