ప్రజావాణి ద‌ర‌ఖాస్తులు పెండింగ్ పెట్టొద్దు: కలెక్టర్ అనురాగ్ జయంతి

కలం యాదగిరిగుట్ట: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల (Prajavani Applications)ను పెండింగ్ పెట్ట‌కుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anurag Jayanthi) అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుతో కలిసి వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 102 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

ద‌ర‌ఖాస్తుల్లో రెవెన్యూ శాఖ 66, మున్సిపాలిటీ 7,సర్వే ల్యాండ్స్ 6, స్పెషల్ డిప్యూటీ యూనిట్ 4, గ్రామీణ అభివృద్ధి శాఖ 3, ఎస్సీ డెవలప్మెంట్ 2, ఇరిగేషన్ 2, హౌసింగ్ 2, విద్యాశాఖ 2, డీఎల్పీఓ 2, బీసీ సంక్షేమం, వైద్య ఆరోగ్య, చేనేత, జౌళి, ఉపాధి కల్పన, జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా పరిషత్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు డిస్పోస్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో జయమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు సాత్విక్, కృతిక, జడ్పీసీఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణా అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>