కలం డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ టైమ్ నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్(Global Summit) మొదటి రోజునే రాష్ట్రానికి సుమారు రూ. 2.43 లక్షల కోట్ల మేర పెట్టుబడులు సమకూరాయి. దాదాపు 35 దేశ, విదేశీ కంపెనీలతో అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ ఇన్వెస్టుమెంట్లతో కొత్తగా నిర్మించబోయే యూనిట్లకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వంతో మొదటి రోజున ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు, పెడుతున్న పెట్టుబడుల వివరాలు :
Global Summit – పెట్టుబడులు
• బ్రూక్‌ఫీల్డ్ యాక్సిస్ వెంచర్స్ కూటమి : రూ. 75 వేల కోట్లు (గ్లోబల్ రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్, డీప్ టెక్ హబ్ ఏర్పాటు)
• ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ : రూ.41 వేల కోట్లు (5 బిలియన్ డాలర్లతో మెగా డిజిటల్ మీడియా, టెక్నాలజీ హబ్ ఏర్పాటు)
• సల్మాన్‌ఖాన్ ఫిల్మ్ స్టుడియో : రూ. 10 వేల కోట్లు
• విన్ గ్రూప్ : రూ. 27,000 కోట్లు (పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్ఫ్రా విస్తరణ)
• SIDBI స్టార్ట్ అప్ : రూ.1,000 కోట్లు
• వరల్డ్ ట్రేట్ సెంటర్ : రూ. 1000 కోట్లు (ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు)
• ఈవ్రెన్ యాక్సిస్ ఎనర్జీ : రూ.31500 కోట్లు (సోలార్, విండ్ పవర్ మెగా ప్రాజెక్టుల ఏర్పాటు)
• మెఘా ఇంజనీరింగ్ గ్రూప్ : రూ.8 వేల కోట్లు (సోలార్, పంప్‌డ్ స్టోరేజ్, ఈవీ ప్రాజెక్టుల ఏర్పాటు)
• జీఎంఆర్ గ్రూప్ : రూ. 15,000 కోట్లు (ఏరోస్పేస్, డిఫెన్స్, కార్గో విస్తరణ)
• అపోలో మైక్రో సిస్టమ్ లిమిటెడ్ : రూ.1,500 కోట్లు (డిఫెస్స్, ఏవియానిక్స్ తయారీ)
• సోలార్ ఎరోస్పేస్, డిపెన్స్ : రూ. 1,500 కోట్లు (మిస్సైల్ భాగాలు, ఏరో ఇంజన్ స్ట్రక్చర్, ఆర్టిల్లరీ తయారీ)
• ఎంపీఎల్ లాజిస్టిక్స్ : రూ. 700 కోట్లు
• టీవీఎస్ ఐఎల్పీ : రూ.200 కోట్లు
• రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్ : రూ. 7,000 కోట్లు (హైడ్రోజన్ టెక్ విస్తరణకు )
• సాహీటెక్ ఇండియా : రూ. 1,000 కోట్లు (డిస్ట్రిబ్యూషన్ హైడ్రో టెక్)
• కృష్ణా పవర్ యుటిలిటీస్ : రూ. 5,000 కోట్లు (ఇంటిగ్రేటేడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు)
• అల్ట్రా బ్రైట్ సిమెంట్స్, రెయిన్ సిమెంట్స్ : రూ.2000 కోట్లు (సిమెంట్ రంగ విస్తరణ)
• సీతారాం స్పిన్నర్స్ : రూ.3 వేల కోట్లు (టెక్స్ టైల్ యూనిట్ స్థాపన)
• షోలాపూర్ తెలంగాణ టెక్స్ టైల్ అసోసియేషన్ : రూ. 960 కోట్లు (జీనియస్ ఫిల్టర్స్ కంపెనీ సహకారంతో పవర్ లూమ్ టెక్నికల్ యూనిట్ ఏర్పాటు)
• అథిరత్ హోల్డింగ్స్ : రూ. 4,000 కోట్లు (25 కాంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లు స్థాపన)
• అపోలో హాస్పిటల్స్ గ్రూప్ : రూ. 800 కోట్లు (మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చి సెంటర్, మెడికల్ వర్శిటీ స్థాపన)
Read Also: ఏఐతో సెలబ్రిటీలకు ఇబ్బందులు
Follow Us On: Youtube


