Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ సచివాలయంలో భద్రత పెంపు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి (Telangana Secretariat) మరింత భద్రత పెంచారు. ఇప్పటివరకు వ్యక్తులకు అమలు చేస్తున్న క్యూ ఆర్ కోడ్ సిస్టంను ఇక నుంచి వాహనాలకు సైతం వర్తింపజేయనున్నారు. లోపలకు, బయటకు వస్తున్న వాహనాలపై మరింత నిఘా పెంచనున్నారు. ఇంటెలిజెన్స్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో పలు భద్రతా లోపాలను గుర్తించిన తరువాత, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ సాయంతో క్యూ ఆర్ కోడ్ సిస్టంను అమలు చేయబోతున్నారు.

ప్రతి వాహనానికి క్యూ ఆర్ కోడ్..

సచివాలయంలోకి వచ్చే ప్రతి వాహనానికి ముందుగా సెక్యూరిటీ సిబ్బంది క్యూ ఆర్ కోడ్ ఇస్తారు. దాన్ని స్కాన్ చేయగానే.. వాహనం, యజమాని, ఇతరత్ర వివరాలన్నీ కంప్యూటర్‌లో సేవ్ అవుతాయి. వచ్చేటప్పుడు మరోసారి స్కాన్ చేసి, వాహనం వెళ్లిపోయినట్లుగా నమోదు చేస్తారు. ఇలా చేయడం వలన, సదరు వ్యక్తి ఎన్ని సార్లు వచ్చారు.. అనేది ఈజీగా తెలిసిపోనుంది. నకిలీ ఉద్యోగులు, సచివాలయం అడ్డా చేసుకుని మోసాలు సాగించే వ్యక్తులను పూర్తిగా నిషేధించే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

వాహనాల సంఖ్యపై పర్యవేక్షణ..

సచివాలయానికి రోజూ వందల సంఖ్యలో వాహనాలు వస్తూ వెళ్తుంటాయి. ఇక నుంచి రోజువారీగా రాకపోకలపై సంపూర్ణంగా పర్యవేక్షణ ఉండనుంది. మంత్రులు, ఉన్నతాధికారులు, సచివాలయ సిబ్బంది వాహనాలను ప్రత్యేకంగా క్యూ ఆర్ కోడ్ ఇచ్చే అవకాశం ఉంది. మిగతావారికి విజిటర్ కోడ్ అమలు చేయనున్నారు. మొత్తం డేటాను కంట్రోల్ సెంటరులో భద్రపరచనున్నారు. తద్వారా, సచివాలయంలో ఇక నుంచి ఎలాంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉండబోదని స్పష్టం చేస్తున్నారు.

నకిలీ ఉద్యోగుల బెడద..

కొన్ని నెలల కిందట సచివాలయంలో నకిలీ ఉద్యోగుల బెడద కలకలం రేపింది. ఫేక్ ఐడీ కార్డులతో సున్నితమైన కార్యాలయాల పరిధిలోకి వెళ్లినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించి అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సీఎం నుంచి సైతం ఆదేశాలు వెళ్లడంతో దశల వారీగా అమలు చేస్తున్నారు. సచివాలయంలోకి వెళ్లే ప్రతి వ్యక్తికి క్యూ ఆర్ కోడ్ తో ఒక ట్యాగ్ ఇస్తారు. ఎవరిని కలవాలనుకుంటున్నారో, వారి వద్దకే వెళ్లాల్సి ఉంటుంది. మరో ఆఫీస్ వద్దకు వెళ్తే అక్కడున్న ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రశ్నించి వెనక్కి పంపుతున్నారు. ఇక నుంచి వాహనాలకు సైతం ఇలాంటి కఠినమైన విధానం అమలు చేయబోతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>