కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రక్షణ సేన రాష్ట్రానికి రక్షణ కవచంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. జెండా పండుగలో భాగంగా మానకొండూరు (Manakondur) నియోజకవర్గంలోని కన్నాపూర్ గ్రామంలో మండల పార్టీ ముఖ్య నేత చిట్టెంపల్లి జైపాల్ రెడ్డి, టీఆర్ఎస్ కరీంనగర్ బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్, నియోజకవర్గ ఇన్‌ఛార్జి బుడిగె పరశురాం గౌడ్ జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్ద దింపడమే లక్ష్యంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షురాలు కవిత రెండున్నర సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతర పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమకారులను కించపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి గ్రామంలో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించుకుంటామన్నారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఎండీ సల్మా, అత్హర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, ఆదివాసీ విభాగం జిల్లా అధ్యక్షులు కుతాడి శ్రీనివాస్, నియోజకవర్గ అబ్జర్వర్ మల్లారెడ్డి, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు చెన్నమల్ల చైతన్య, నాయకులు వెలిగెటి రవికుమార్, బాసవేని రాజేందర్, గర్శకుర్తి విద్యాసాగర్ ఎండీ ఉమర్, కొండపాక రాకేష్, మనుపాటి, రమేష్ సుజీత్, జంగ అపర్ణ, అంజలి, శిరీష రమేష్, కవిత పాల్గొన్నారు.

