Mobile Popup Ad
Mobile Popup Ad

పింఛన్లలో భారీ కోత.. 1.28 లక్షల మంది తొలగింపు!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల (Pensions) తొలగింపులో సంచలన నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో పింఛన్ల ఏరివేత కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ లెక్కలు కొలిక్కి రాగా, సుమారు 1.28 లక్షల మందిని తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. వీరంతా చనిపోయినవారు, స్థానికంగా అందుబాటులో లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, పన్ను కడుతున్నవారు, అధికంగా వ్యవసాయ భూమి ఉన్న వారుగా తేలింది. వీరిని వెంటనే తొలగించాలని అధికారులు సిఫార్సు చేయడంతో ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో 48 వేల మంది దివ్యాంగులు, వితంతువులకు కొత్త పింఛన్లు ఇవ్వాలని జాబితా రెడీ చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పింఛన్ల పెంపు ఉండొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>