కలం, వెబ్ డెస్క్ : ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్టు టీటీడీ (TTD) ప్రకటించింది. ఈ నెల 21న ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు టీటీడీ (TTD) అధికారులు. 22వ తేదీన ఎప్పటిలాగే ఈ సారి కూడా సాలకట్ల తెప్పోత్సవాలు, వంసతోత్సవాలు, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వర్చువల్ లాంటి సేవల టికెట్లను అందించబోతున్నారు. టికెట్లు పొందిన వారు 21వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12గంటల లోపు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది.
అంగ ప్రదక్షిణ కోటా టికెట్లను 23వ తేదీన ఉదయం 10 గంటలకే టీటీడీ అధికారులు ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇదే రోజు 11 గంటల ప్రాంతంలో ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లతో పాటు 3 గంటల సమయంలో వృద్ధులు, దివ్యాంగుల టికెట్లను రిలీజ్ చేయబోతున్నారు అధికారులు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రూ.300 టికెట్ల కోటాను 24న మార్నింగ్ 10 గంటల ప్రాంతంలో విడుదల చేయనుంది టీటీడీ. ఇక ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అద్దె గదుల టికెట్లను కూడా రిలీజ్ చేస్తారు. వీటన్నింటినీ https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ లో బుక్ చేసుకుని అక్కడే పేమెంట్ చేయొచ్చు.


