గ్రామ పంచాయతీలకు భారీ శుభవార్త

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ (Telangana Cabinet) గ్రామ పంచాయతీలకు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు పంచాయతీ ఖాతాలకు అందించే నిధులను ముందు ట్రెజరీలో జమ చేసి.. అక్కడి నుంచి బదిలీ చేసేవారు. ఇక నుంచి ఈ విధానం మారబోతుంది. గ్రామ పంచాయతీలకు సమీపంలో ఉన్న జాతీయ, సహకార బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లోనే నిధులు జమ చేయనుంది.

తద్వారా, డబ్బులు తీసుకోవడం మరింత సులభంగా మారనుంది. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 సవరణకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లు పెట్టి ఆమోదించబోతున్నారు. తాజా నిర్ణయంతో నిధులు తీసుకోవడంలో పాలవర్గానికి వ్యయ ప్రయాసలు తప్పనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>