కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాలసదన్ ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి (DLSA Secretary) పి.రవీందర్ గురువారం సందర్శించారు. బాలసదన్ లోని వసతులు, పరిసరాలను పరిశీలించారు. బాలలకు అందుతున్న సౌకర్యాలు, వారి సంక్షేమానికి చేపడుతున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. బాలసదన్ లోని వసతులను పరిశీలించిన అనంతరం సంబంధిత వివరాలను సూపరింటెండెంట్ వైష్ణవిని అడిగి తెలుసుకున్నారు.

