Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై అఖిలపక్ష సమావేశం

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ.. ఈనెల 4వ తేదీన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశాన్ని (All Party Meeting) నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో, 6వ అంతస్తులోని రూమ్ నెంబర్ 33 లో ఆ రోజు ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై తమ విలువైన సలహాలు, అభిప్రాయాలను పంచుకునేందుకు ఒక్కో పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధులను నామినేట్ చేయాల్సిందిగా ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలను కోరింది. సమావేశానికి హాజరయ్యే రాజకీయ ప్రతినిధులు సచివాలయంలోకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవేశించేందుకు వీలుగా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి దేవీదాస్ (87126 66004) ను సంప్రదించాలని ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>