కార్మిక నేత సమ్మయ్యకు జాతీయ స్థాయి గుర్తింపు

కలం, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాకు చెందిన టేకుమల్ల సమ్మయ్య (Tekumalla Sammaiah) ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (AITUC) జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గత నాలుగు రోజులుగా కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరుగుతున్న ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సమ్మయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు కాశెట్టి లక్ష్మయ్య, పిట్టల శ్రీనివాస్, జంగం తిరుపతి, కేంసారం శ్రీనివాస్, నర్సింహులు, ఎ.రజిత, కడారి భీరయ్య, డి.రజిత హర్షం వ్యక్తం చేశారు.

సమ్మయ్య గత మూడు దశాబ్దాలుగా కార్మిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని నాయకులు తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల హక్కులు, కనీస వేతనాలు, పనికి తగిన వేతనం, ఉద్యోగ భద్రత కోసం జిల్లాలో అనేక పోరాటాలు నిర్వహించారని పేర్కొన్నారు. అలాగే పలు కార్మిక సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నారని తెలిపారు. సమ్మయ్య ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎంపిక చేసిన ఏఐటీయూసీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో సమ్మయ్య నాయకత్వంలో మరిన్ని కార్మిక సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొంటూ ఆయన ఎన్నిక పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>