మావోయిస్టులు ఉన్నప్పుడే ఆదివాసులకు న్యాయం :కోవ లక్ష్మి

కలం, కొమురంభీం ఆసిఫాబాద్ : మావోయిస్టులు ఉన్న సమయంలోనే ఆదివాసులకు న్యాయం జరిగిందని, అప్పుడు అటవీశాఖ అధికారులు గిరిజనుల జోలికి వచ్చేవారు కాదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి (Kova Laxmi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొమురం భీం 86వ వర్ధంతి సందర్భంగా సోమవారం కెరమెరి మండలం జోడేఘాట్‌లో నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులను హతమార్చిన తర్వాత గిరిజనులపై అటవీశాఖ అధికారుల దాడులు పెరిగాయని కోవ లక్ష్మీ (Kova Laxmi) ఆరోపించారు. ఆదివాసుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, గిరిజనులపై దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. కొమురం భీం వర్ధంతి సభలో ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>