సూర్యాపేట ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి.. కీలక ఆదేశాలు!

కలం, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఈ విషాద సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులకు మెరుగైన ఉచిత వైద్యం వెంటనే అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ఆదేశించారు. బాధితులకు తక్షణమే తగిన సహాయక చర్యలు అందించాలని అధికారులకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>