కలం, వెబ్ డెస్క్: రాజమండ్రిలో (Rajahmundry) మద్యం మత్తులో ముగ్గురు మహిళలు హల్చల్ చేశారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గుడి సమీపంలో మద్యం సేవించిన మహిళలు ఇద్దరు యువకులతో గొడవకు దిగారు. వారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. యువకుల ఫిర్యాదు మేరకు ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసిన వన్‌టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు. ఈ ఘటనపై విచారించిన కోర్టు ముగ్గురు మహిళలకు 14 రోజుల రిమాండ్ విధించింది. మహిళలు మద్యం సేవించి రోడ్లపై హల్ చల్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

