వడ్గావ్ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం

కలం, తానూర్: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తానూర్ మండలం వడ్గావ్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో (Vadgaon Government School) దాతలు, సంస్థలు, తల్లిదండ్రుల సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కంప్యూటర్లు, డెస్కులు, బెంచీలు, కుర్చీలు, ప్రింటర్, ఇన్వర్టర్ తదితర సామగ్రిని పాఠశాలకు అందజేశారు.

కంప్యూటర్ ల్యాబ్‌తో విద్యార్థులకు డిజిటల్ విద్యపై అవగాహన పెరిగి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని ప్రధానోపాధ్యాయులు వార్లె మహేష్ తెలిపారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కదం సుమన్ బాయి గోవింద్, ఏఏపీసీ చైర్మన్ మధ్నూరే వైశాలి, రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ పండిత్ మధ్నూరే, దాతలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>