కలం, మునుగోడు : నేర్మట (Nermata) గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆగ్రామ సర్పంచ్ నారపాక వసంత ధనయ్య (Narapaka Vasantha Dhanayya) అన్నారు. శుక్రవారం నేర్మట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ వారు ఇబ్రహీంపట్నం డిపో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మా గ్రామానికి ఇబ్రహీంపట్నం డిపో బస్సు లేనందున మాగ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం, రాత్రి కస్తాల నుండి వెళ్లే బస్సు ధోని పాముల నుండి నేర్మటకు వచ్చే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను వారు విజ్ఞప్తి చేశారు.
గతంలో ఉన్న సర్వీసును పునరుద్ధరించాలని డిమాండ్
డిపో మేనేజర్ అందుబాటులో లేకపోవడంతో అసిస్టెంట్ డిపో సెక్రటరీకి వినతి పత్రం ఇచ్చామని వారు తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ గ్రామానికి ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) బస్సు లేనందున రాకపోకలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఇబ్రహీంపట్నం బస్సు డిపో ఒకప్పుడు వచ్చేదని ఇప్పుడు రాకపోవడంతో ఆర్టీసీ అధికారులను కలిశామని, వారు సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. హైదరాబాద్‌కు, ఇబ్రహీంపట్నం ఉదయం, సాయంత్రం పోవాలంటే మాగ్రామ ప్రజలకు బస్సు సౌకర్యం లేనందున నానా తంటాలు పడుతున్నారని వారన్నారు.
త్వరలోనే బస్సు వస్తుందని ఆశాభావం
త్వరలోనే మన గ్రామానికి ఇబ్రహీంపట్నం బస్సు వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో సెక్రటరీ నారాయణ, గ్రామ ప్రజలు జెర్రిపోతుల ధనంజయ, ఈరటి వెంకటయ్య, నారపాక అనిల్, బండమీది వేణు తదితరులు పాల్గొన్నారు.

