కలం, వెబ్ డెస్క్: పరిశ్రమల నిర్వచనంపై సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ఆధ్వర్యంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 1978 నాటి తీర్పుని కొంత సవరించింది. ఇక నుంచి ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్–2020లో పాత తీర్పులో పరిశ్రమ అంటే ఏ అంశాలను పేర్కొన్నారో, వాటిని ఉపయోగించవద్దని సూచించింది. 5:4 తేడాతో ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.
అసలు కేసు ఏంటీ..
1978లో బెంగళూరు వాటర్ సప్లై బోర్డులో కొంత మంది ఉద్యోగులను తొలగించడంతో వారంతా లేబర్ కోర్టును ఆశ్రయించారు. తమకు పరిశ్రమల వివాదాల చట్టం–1947 ప్రకారం హక్కు ఉంటుందని వాదించారు. దీనికి కౌంటర్‌గా వాటర్ సప్లై బోర్డు.. తమది పరిశ్రమ కాదని, ప్రభుత్వ సంస్థ కాబట్టి, ఈ చట్టం తమకు వర్తించదని వాదించింది.
ఇక నుంచి మార్పు..
దీన్ని సుప్రీంలో సవాల్ చేయగా.. ఈ కేసు అనేక మలుపులు తిరిగి సుప్రీంకోర్టు వద్దకు వచ్చింది. అసలు ‘పరిశ్రమ’ అని దేన్ని అంటారు..? అనే అంశాన్ని నిర్వచించేందుకు 9 మందితో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. క్రమబద్ధంగా పని జరుగుతుండటం, యజమాని–ఉద్యోగుల మధ్య సహకారం, ప్రజల అవసరాలను తీర్చగలిగేలా ఉంటే దాన్ని పరిశ్రమగా గుర్తించవచ్చని కోర్ట్ వివరించింది. కొత్త కార్మిక చట్టాల నేపథ్యంలో ఇక నుంచి సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రామాణికం కానుంది.

